Monday, May 13, 2024

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 52 రోజులయింది.. మరో 48 రోజుల తర్వాత మా కార్యాచరణ

spot_img

గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు ఎప్పుడు చేయలేదని కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు అన్నారు. ఆయన ఈ రోజు మానకొండూరు మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేగా గెలుపొందలేదని ఎద్దేవా చేశారు. రాజకీయ అనుభవం లేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. మానకొండూర్ చరిత్రలో జడ్పీటీసీని పోలీసులతో బయటకు పంపిన చరిత్ర మీకే దక్కుతుందన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇలా చేస్తున్నారని విమర్శించారు. వేదికల మీద వాడు, వీడు అని మాట్లాడడం సిగ్గు చేటని అన్నారు.

Read Also: పార్కింగ్ చేసిన బస్సులో మంటలు.. పూర్తిగా దగ్దం

గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు ఎప్పుడు చేయలేదని అన్నారు. మీ ప్రభుత్వం ఏర్పడి 52 రోజుల అయిందని, మరో 48 రోజుల తర్వాత 100 రోజులు అవుతుందని, ఆ తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ పోలీసులు బెస్ట్ పోలీసు అవార్డ్ తీసుకోవడం జరిగిందన్నారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎన్నికల ముందు రసమయి బాలకిషన్‎కి వ్యతిరేకంగా చాలా వీడియోలను సర్క్యూలేట్ చేశారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. బీసీలను, జడ్పీటీసీలను అగౌరపరిచేలా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతున్నారని, దీన్ని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. మరోసారి ఇలా జరిగితే.. కబర్దార్ అని రామకృష్ణారావు హెచ్చరించారు.

Latest News

More Articles