Monday, May 20, 2024

తెలంగాణ ఉద్యమ కేసులపై పోలీస్ శాఖ కీలక నిర్ణయం

spot_img

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ కేసుల ఎత్తివేతకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్నది. 2014 జూన్ రెండవ తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల ఎస్పీలను కమీషనర్లను తెలంగాణ డిజిపి రవిగుప్తా ఆదేశించారు.

2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ రెండవ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు  సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల కేసులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయనున్నట్లు సమాచారం.

Latest News

More Articles