Monday, May 13, 2024

సీఎం కేసీఆర్‌ పేదల దేవుడు

spot_img

సూర్యాపేట: గత పాలకుల హయాంలో నిర్విర్యమైన కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ గారిదే అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా 300 మంది చేతివృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ.లక్ష విలువ చేసే గ్రాంట్‌ చెక్కులను కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు.

Read Also.. పాముకాటు మందులు.. గర్బిణుల ఆరోగ్యంపై ప్రభత్వం కీలక ఆదేశాలు..!

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందే సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై ఒక ఆలోచనతో ఉన్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి సీఎం అయ్యాక తన ఆలోచనలకు రూపం ఇస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని సమపాళ్లతో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. గ్రామాల్లో వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారని నమ్మిన సీఎం కేసీఆర్‌.. వ్యవసాయం దండుగ అనే స్థాయి నుంచి పండుగ అనేలా తీర్చిదిద్దారని కొనియాడారు. గొల్ల, కురుమలకు సబ్సిడీ గొర్రెలు, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ, నేతన్నలకు చేయూత అందించడంతో పాటు ప్రస్తుతం చేతి వృత్తులను నమ్ముకుని జీవించే 15 కులాల వారికి రూ.లక్ష గ్రాంట్‌ను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారన్నారు.

Read Also.. చనిపోయిన తండ్రి క‌ల‌ను నిజం చేసిన టెన్నిస్ స్టార్..!!

ప్రభుత్వ సహాయంతో కుల వృత్తిదారులకు ఆర్థిక భరోసా కలిగిందన్నారు. కుల వృత్తులను కాపాడేందుకు తీసుకువస్తున్న పథకాలతో మళ్లీ మంచి రోజులు వచ్చాయన్నారు. ఇలాంటి పథకాలను తీసుకువస్తున్న ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజానీకం ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. పాలన చేతకాని విపక్షాలు సీఎం కేసీఆర్‌ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే  అన్నపూర్ణ గా తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు. కాంగ్రెస్ , బిజెపి పాలన లోని రాష్ట్రాల్లో ఆకలి కేకలు, కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు రావాలంటే సీఎం కేసీఆర్‌ పరో పది కాలాల పాటు పేదల పాలిట దేవుడైన కేసీఆర్ సీఎంగా ఉండాలన్నారు. ఇందుకు ప్రజలు అండగా నిలువాలని మంత్రి కోరారు.

Latest News

More Articles