Tuesday, May 21, 2024

4 వేల మందికి ఉపాధి.. నేడే నిజామాబాద్ కి మంత్రి కేటీఆర్

spot_img

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు నిజామాబాద్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐటీ టవర్ తో పాటు న్యాక్, మున్సిపల్ భవనాలను ప్రారభించనున్నారు. మినీ ట్యాక్ బండ్, వైకుంఠ దామాలను ప్రారంభిస్తారు. పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్ కు .. బీఆర్ఎస్ శ్రేణులు పట్టణాన్ని గులాబీమయంగా మార్చారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో.. మంత్రి కేటీఆర్ పర్యటనకు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ఐటీ టవర్స్ ను మంత్రి జిల్లా ప్రజలకు అంకితం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్ల తో ఐటీ హాబ్ నిర్మించింది. 750 మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా 4వేల మందికి పరోక్షంగా ఉపాది కల్పించేలా ఐటీ టవర్స్ సిద్దం చేశారు. ఈ పాటికే 15 సంస్థలతో ఒప్పందం పూర్తి చేసి.. 280 మంది ఉద్యోగులను నియామకం చేశారు.

Latest News

More Articles