Monday, May 20, 2024

వ్యవసాయం కల్పించిన ఉపాధి మరే రంగం కల్పించలేదు

spot_img

వ్యవసాయం కల్పించిన ఉపాధి మరే రంగం కల్పించలేదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఒకే రోజు రూ.6 వేల కోట్ల రుణమాఫీ ట్రెజరీ చరిత్రలో రికార్డ్ అని తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి. రూ.17 వేల కోట్లు 2018 వరకు మొదటి విడతలో రుణమాఫీ చేశాం. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక రూ.36 వేల వరకు రైతుల రుణాలను వెంటనే మాఫీ చేశాం. కరోనా నేపథ్యంలో ఆర్థిక వెసులుబాటు లభించలేదు. కరోనా కారణంగా రాష్ట్రం రూ.లక్ష కోట్లు నష్టపోయింది. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తి చేస్తున్నాం. రుణమాఫీ చేయలేరులే అని విపక్షాలు భావించాయి. ఆదాయం ఎలా సృష్టించవచ్చో తెలిసిన వ్యక్తి కాబట్టే తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన ఇంత గొప్పగా ఉందన్నారు.

రూ.5 వేలు, 10 వేలకు ఎకరా భూమి అమ్ముకున్న పరిస్థితి నుండి.. నేడు రూ. 20 లక్షల నుండి రూ.50 లక్షలు కోటి, 2 కోట్ల ధర పలుకుతున్నాయని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్రంలో విజయవంతంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయం కల్పించిన ఉపాధి మరే రంగం కల్పించలేదన్నారు. తెలంగాణ అత్యధిక ప్రజల జీవనాధారం వ్యవసాయమని.. ఎన్ని పరిశ్రమలు పెట్టినా ఇంత పెద్దఎత్తున ఉపాధి లభించదన్నారు. దీని ప్రాధాన్యత గుర్తించిన కేసీఆర్ ఈ రంగానికి చేయూతనిచ్చారని తెలిపారు మంత్రి. వ్యవసాయ రంగం బలోపేతం అయితే దాని చుట్టూ అల్లుకున్న రంగాలు బలపడతాయని చెప్పారు.

Latest News

More Articles