Monday, May 13, 2024

29 కోట్లతో పాలెంలో వ్యవసాయ కళాశాల ప్రారంభం..!

spot_img

పాలెం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 29 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ కళాశాల భవనాన్ని ప్రారంభించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..

‘వ్యవసాయ విద్యకు ఉజ్వల భవిష్యత్ ఉంది. వ్యవసాయ విద్యను అభ్యసించడంలో బాలికలు ముందున్నారు. భిన్నమైన కోర్సులతో భిన్నమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం, భీమా రంగం, బ్యాంకింగ్ రంగం, ప్రాసెసింగ్ రంగం, విత్తనరంగాలలో అనేక అవకాశాలు ఉన్నాయి

తెలంగాణలో ఏ చెయ్యి, ఏ మెదడు ఖాళీ లేదు. 9 ఏళ్లలో అందరికీ ఉపాధి ఇచ్చే స్థాయికి తెలంగాణ ఎదిగింది. భవిష్యత్ మరింత ఉన్నతంగా ఉండబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల కాలనీలుగా విభజించి పంటలసాగును ప్రోత్సహిస్తే ఏ విధమైన ఆహార కొరత లేకుండా.. విదేశాలకు ఎగుమతులు పెంచవచ్చు అని చెబుతున్నారు’ అని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

Latest News

More Articles