Sunday, May 12, 2024

బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలంటే గతంలో ఎవరూ పట్టించుకోలేదు

spot_img

హైదరాబాద్‎లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆషాఢ మాసం బోనాలు, మహంకాళి జాతర తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ప్రత్యేకమని ఆయన అన్నారు. బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బేగంపేటలోని హరిత ప్లాజాలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. ‘ఆషాఢ మాసం బోనాలు, మహంకాళి జాతర తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ప్రత్యేకం. హైదరాబాద్‎లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. గతంలో బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలని అడిగితే ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించింది. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. జూన్ 22న గోల్కొండలో ఆషాఢ బోనాలు ప్రారంభమవుతాయి. జులై 9న సికింద్రాబాద్ మహంకాళీ బోనాలు, 10న రంగం నిర్వహిస్తాం. జూలై 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు నగరమంతా జరుగుతుంది. లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు, వారికి ఎలాంటి ఆటంకం జరుగకుండా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటాం. వచ్చే నెల 20న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలను సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఏర్పాట్లను చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఉత్సవాల్లో భక్తులు లక్షలాదిగా పాల్గొంటున్నారు’ అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అధికారులు, ఆలయ నిర్వాకులతో సమావేశం నిర్వహించాం. అందరిని కలుపుకుపోయి, బోనాలపండుగ ఎంతో ఘనంగా నిర్వహిస్తాం. గత ప్రభుత్వాలు బోనాల నిర్వహణకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయకపోయేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బోనాల పండుగ ఎంతో ఘనంగా జరిపిస్తున్నారు.

Latest News

More Articles