Monday, May 13, 2024

మే 8న కోకాపేట‌లో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన

spot_img

ఈ నెల (మే) 8వ తేదీన హైదరాబాద్ కోకాపేటలో నిర్మించనున్న ఇస్కాన్ టెంపుల్ ఆలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కోకాపేట్ లో అత్యంత విశాలమైన ప్రాంగణంలో అతి పెద్ద ఆలయాన్ని అంతర్జాతీయ కృష్ణ చైనత్య సంఘం (ఇస్కాన్) నిర్మించబోతోంది. ఈ ఆలయ నిర్మాణానికి ఈ నెల 8న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణ నమూనాను ఇస్కాన్ ప్రతినిధులు విడుదల చేశారు. ఈ కట్టడంలో శ్రీరాధాకృష్ణ టెంపుల్, శ్రీనివాస గోవింద టెంపుల్, రాజగోపురం, నిత్యాన్నదాన హాల్ ప్రధానంగా ఉంటాయి. ఇటివ‌లే సెక్రటేరియట్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన ఇస్కాన్ ప్రతినిధులు శంకుస్థాపనకు ఆహ్వానించారు. శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని వారికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

Latest News

More Articles