Tuesday, May 21, 2024

రాహుల్ అబద్దాల్..!

spot_img

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సీఎం కేసీఆర్‌ మద్దతిచ్చారు. విపక్ష నేతలపై కేసులు పెడుతున్న మోదీ.. కేసీఆర్‌పై ఎందుకు పెట్టడం లేదు ? బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు ఒకటే. కాంగ్రెస్‌ మీటింగ్‌ను పాడుచేసేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ మీటింగ్‌లా? తుక్కుగూడ కాంగ్రెస్ మీటింగ్ సాక్షిగా రాహుల్ గాంధీ ఆడిన అబద్దాల చిట్టా ఇది. ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉంది కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పరిస్థితి. అదేపనిగా అబద్ధాలు చెబితే ప్రజలు నవ్వుకుంటారనే కనీసం ఇంగితం లేకుండా తుక్కుగూడ సభలో అబద్ధాలను వల్లెవేశారు.

‘పాడిందే పాడరా..’ అన్నట్టు గత సభలో చె ప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెప్పారు. రాష్ట్ర అ భివృద్ధిని, సంక్షేమాన్ని పట్టించుకోకుండా రాజకీయమే పరమావధిగా, ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా నోటికొచ్చిన అబద్ధాలు పలికారు. గల్లీస్థాయి నేతలా మాట్లాడేశారు. వాస్తవాలేంటో తెలుసుకోకుండా రాష్ట్ర నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివేశారు. రాహుల్‌గాంధీ.. బీజేపీకి సీఎం కేసీఆర్‌ అ న్ని విధాలుగా మద్దతిస్తున్నారంటూ రాహుల్‌ మరో ఆరోపణ చేశారు. దేశానికి ఉపయోగమైన వాటికి భేషరతుగా మద్దతిచ్చామని, హాని చేసే వాటిని వ్యతిరేకించామని కేసీఆర్‌ ఇది వరకే స్పష్టం చేశారు.

ఇక సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే పలుమార్లు ఆమె విచారణకు కూడా హాజరయ్యారు. మంత్రులు గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డితో పాటు మరికొందరు ఎంపీలపైనా ఈడీ, ఐటీ దాడులు చేశాయి. వీటన్నింటిని దాచేసి సీఎంపై కేసులు పెట్టడం లేదంటూ అబద్ధాలను అలవోకగా వల్లెవేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం.. ఈ మూడు పార్టీలు ఒక్కటేనని రాహుల్‌ ఆరోపించారు. ఇంతకన్నా సిగ్గుచేటు మరోటి ఉండదు. . జాతీయస్థాయిలో బీజేపీపై సీఎం కేసీఆర్‌ రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఈ దేశాన్ని కాంగ్రెస్‌, బీజేపీ కబంధ హస్తాల నుంచి విడిపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ‘అబ్‌కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో దేశ సాగురంగం, రైతుల ముఖచిత్రాన్ని మార్చేందుకు కృషి చేస్తున్న బీఆర్‌ఎస్‌పై రాహుల్‌ ఇలాంటి నిందలు వేయడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం.

Latest News

More Articles