Monday, May 20, 2024

ప్రతిపక్షాల ఆందోళనల మధ్య.. ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

spot_img

ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం కూడా లభించింది. సోమవారం నాడు ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 131 మంది, వ్యతిరేకంగా 102 మంది ఓటు వేశారు. ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో కేంద్రం బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనుంది. రాష్ట్రపతి ఆమోదంతో ఢిల్లీ ఆర్డినెన్స్ చట్టం కానుంది.

అయితే ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ అనైతిక బిల్లుని బీఆర్ఎస్ వ్యతిరేకించగా తెలుగు పార్టీలైన వైసీపీ, టీడీపీలు మద్దత్తు తెలిపాయి. మొదట ఓటింగ్ విషయంలో గందరగోళం నెలకొంది. ముందు మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు. అయితే విపక్షాలు డివిజన్‌కు పట్టుబట్టడంతో రెండోసారి ఓటింగ్ నిర్వహించారు. సాంకేతిక సమస్యతో స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ నిర్వహించారు.

 

Latest News

More Articles