Monday, May 20, 2024

ఎస్టీ వర్గీకరణ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలి

spot_img

ఎస్టీ వర్గీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబు నాయక్ డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ చౌరస్తా దగ్గర రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన..ఎస్టీల మధ్య చిచ్చుపెట్టి కాంగ్రెస్ పార్టీ తన పబ్బం గడుపుకోవాలని చూస్తుందన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. లేని పక్షంలో గిరిజనులందరం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

Latest News

More Articles