Monday, May 13, 2024

గురుకుల జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ల ఎంపిక జాబితా విడుద‌ల‌

spot_img

తెలంగాణలోని సంక్షేమ గురుకుల జూనియ‌ర్ కాలేజీల్లో 1924 జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టుల‌కు నిర్వ‌హించిన రాత ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ తర్వాత ఈ ఫ‌లితాల‌ను గురుకుల నియామ‌క బోర్డు ఇవాళ(గురువారం) విడుద‌ల చేసింది.

డిగ్రీ కాలేజీల్లో 793 అధ్యాప‌కుల ఉద్యోగ రాత ప‌రీక్ష ఫ‌లితాల‌ను నిన్న(బుధ‌వారం) విడుద‌ల చేసిన అధికారులు.. తాజాగా జేఎల్ పోస్టుల‌కు ఎంపికైన వారి ప్రాథ‌మిక లిస్టును స‌బ్జెక్టుల వారీగా విడుద‌ల చేశారు. ఈ జాబితాల‌ను ట్రిబ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జేఎల్ రాత ప‌రీక్ష‌ల‌ను గ‌తేడాది ఆగ‌స్టు 3 నుంచి 23వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించింది. దివ్యాంగుల కేట‌గిరీ ఫ‌లితాలు త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్నాయి. గురుకుల జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ల జాబితా కోసం treirb.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను కావాల్సిందిగా అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి మ‌ల్కాజ్‌గిరిలో పోటీ చేసి తేల్చుకుందామా

Latest News

More Articles