Monday, May 13, 2024

సీఎం కేసీఆర్‌తోనే అర్చకులకు గుర్తింపు

spot_img

హైదరాబాద్‌ : ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సీఎం కేసీఆర్‌ అర్చకులకు ప్రాధాన్యతనిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఆలయాల్లో నిత్య పూజల కోసం అర్చకులకు నెలకు అందించే రూ.6 వేల భృతిని రూ.10వేలకు పెంచిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

బుధవారం డాక్టర్‌ బీ.ఆర్ అంబేద్కర్‌ సచివాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన అర్చకులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి అలవెన్సును జీవో జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఆలయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అర్చకుల ఆశీర్వచనాలు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాక్షించారు.

Latest News

More Articles