Tuesday, May 14, 2024

ఆసియా క్రీడలకు ముస్తాబవుతున్న చైనా

spot_img

ఆసియా క్రీడలకు ఆతిథ్యమిస్తున్న హాంగ్‌జౌలో ఇవాళ(శనివారం) క్రీడా గ్రామాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ లి హుయోలిన్‌ క్రీడాగ్రామాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. వాలంటీర్లు, ఇతర ఉద్యోగులు ఉన్నతస్థాయి సేవలు అందించడానికి తమ వంతు కృషిచేస్తారని అన్నారు. హాంగ్‌జౌ ఆసియా గేమ్స్ లో అతిపెద్ద క్రీడారహిత వేదికగా అథ్లెట్ల గ్రామం, టెక్నికల్‌ ఆఫీసర్ల గ్రామం, మీడియా గ్రామాలు వ్యవహరిస్తాయన్నారు జిన్హువా.

హాంగ్‌జౌలో జరిగే 19వ ఆసియా క్రీడల సందర్భంగా, ఈ క్రీడా గ్రామాల్లో 20వేల మందికి పైగా క్రీడాకారులు, జట్ల సహాయక, సాంకేతిక సిబ్బందితో పాటు జర్నలిస్టులకు వసతి, క్యాటరింగ్‌, రవాణా, వైద్యసేవల సౌకర్యాలు కల్పిస్తారు. నింగ్బో, వెంజౌ, జిన్హువా, టాంగ్లు, చున్‌యాన్‌లోని ఐదు ఉప-గ్రామాలు, షోగ్జింగ్‌, లిన్‌యాన్‌, గ్జియాషాన్‌లలో మూడు అథ్లెట్ల రిసెప్షన్‌ హోటళ్లు కూడా ప్రారంభమయ్యాయి.

Latest News

More Articles