Tuesday, May 14, 2024

రోడ్డుపై అకారణంగా వ్యక్తులను చితకబాదిన బీజేపీ మంత్రి..వీడియో వైరల్!

spot_img

బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో సిగ్నల్ దగ్గర అకారణంగా వ్యక్తిని చితకబాదిన బీజేపీ మంత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 2న రిషికేశ్‌కు చెందిన సురేంద్ర సింగ్ నేగి, తన స్నేహితుడు ధరమ్‌వీర్‌ ప్రజాపతితో కలిసి వెళ్తుండగా.. ఓ చోట ట్రాఫిక్ జామ్ అయింది.

అదే సమయంలో ఉత్తరాఖండ్‌ ఆర్థిక మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ ప్రయాణిస్తున్న కారు కూడా బైక్‌ పక్కన ఆగింది. బైక్‌ వెనక కూర్చొన్న సురేంద్ర సింగ్‌ తన స్నేహితుడికి ఏదో చెప్పడాన్ని చూసిన మంత్రి.. కారు దిగి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీ  గురించి కాదు సార్ అని చెబుతున్నా.. వినిపించుకోకుండా బూతులు తిడుతూ సురేంద్ర సింగ్ ను కొట్టాడు.ఆ వెంటనే మంత్రి పీఆర్వో, గన్‌మెన్‌, మరి కొందరు కలిసి బాధితులపై దాడికి పాల్పడ్డారు.

మంత్రి తనను అకారణంగా కొట్టడంపై సురేంద్ర సింగ్‌ నేగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడికి చెందిన వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించి.. మంత్రి, ఆయన పీఆర్వో, గన్‌మెన్‌, మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

Latest News

More Articles