Monday, May 20, 2024

వినాయక చవితి పూజా విధానం, ప్రాముఖ్యత !

spot_img

అన్ని గణాలకు అధిపతి అయిన గణపతికి దేవతలు సైతం తొలి పూజ చేస్తారు. యజ్ఞాలు, యాగాలు మొదలు ఏ శుభకార్యం చేసినా సరే ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడాలని ముందుగా వినాయకుడికి పూజ చేయడం అనాదిగా వస్తోంది. సిద్ది-బుద్దికి అదిదేవత గణేశుడు. ఆయన్ని పూజిస్తే బుద్ది కుశలత, కార్యసిద్ధి రెండూ సొంతమవుతాయని పండితులు చెబుతారు. వినాయకుడి ఆశీర్వాదంతో సంపద, శ్రేయస్సు నిత్యం మన సొంతమవుతాయి. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 18న జరుపుకుంటున్నారు. కొన్ని క్యాలెండర్లలో సెప్టెంబర్ 19న పండుగ అని ఉన్నప్పటికీ చంద్రోదయంతో ఉన్న చవితి నాడు పండుగ చేసుకోవడం శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. అందుకే 18వ తేదీనే చవితి పండుగ చేసుకోవాలని సూచిస్తున్నారు. వినాయకుడిని 21 రకాల పత్రి (ఆకుల)తో పూజిస్తారు.

ఇది కూడా చదవండి: వన్ ప్లస్ నుంచి సరికొత్త టాబ్లెట్..ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ చూస్తే ఫిదావ్వాల్సిందే..!!

వినాయకుని కథ :

గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి శివుడు వరం కోరుకోమనగా.. గజాసురుడు మహాదేవుడు తన ఉదరంలోనే ఉండాలని వరం అడుగుతాడు. అలాగే అని శివుడు వరమిస్తాడు. దీంతో పరమేశ్వరుడు గజాసురుడి బొజ్జలోకి వెళ్లిపోతాడు. దీని వల్ల శివుడు, శక్తి వియోగం సంభవించి.. లోకాలన్నీ అల్లకల్లోలమవుతాయి. ఈ సమస్యను పరిష్కరించాలని పార్వతీ మాత, సకల దేవతలు శ్రీ మహా విష్ణువును కోరుతారు. దీంతో ఆయన గంగిరెద్దులను ఆడించేవాడిలా గజాసురుడి కొలువుకు వెళ్తారు. అక్కడ ఆడీపాడి గజాసుడిని మెప్పిసార్తు. దీంతో అతడు ఏం కావాలో కోరుకోమనగా.. అతడి పొట్టలో ఉన్న శివుడు కావాలని అడుగుతారు. దీంతో అతడి పొట్టను చీల్చుకుని పరమ శివుడు బయటకు వస్తాడు.

సుదీర్ఘ వియోగం తర్వాత శివుడు తిరిగి వస్తున్న విషయం తెలిసి.. పార్వతీ దేవి అభ్యంగన స్నానానికి వెళ్తుంది. అప్పుడు తన ఒంటికి రాసుకున్న నలుగు పిండితో ఓ విగ్రహాన్ని చేసి ప్రాణం పోసింది. అలా ఉద్భవించిన బాల గణపతిని ద్వారం వద్ద ఉండి లోపలికి ఎవరూ రాకుండా చూసుకోవాలని అమ్మ ఆదేశించింది. వినాయకుడు ద్వారం వద్ద ఉన్న సమయంలోనే శివుడి రావడంతో ఆయనను అడ్డుకున్నాడు. దీంతో శివుడు, బాల గణేశుడి మధ్య యుద్ధం ప్రారంభమైంది. శంకరుడు కోపంతో గణేశుని తల నరికాడు.

స్నానం ముగించిన పార్వతీ మాత.. వినాయకుడి తలతెగిపడటం చూసి ఈ పరమేశ్వురుడిపై కోపంతో రగిలిపోతుంది. వినాయకుడిని తిరిగి బతికించమని శంకరుడిని కోరింది. పార్వతిదేవి కోపాన్ని శాంతింపజేయడానికి, శంకరుడు తన సేవకులను దక్షిణ దిక్కుకు తల పెట్టి పడుకున్న జీవి తలను తీసుకురావాలని ఆదేశించాడు. సేవకులు ముల్లోకాలు తిరిగి గజాసురుడి ఏనుగు తలను తీసుకువచ్చారు.  ఏనుగు తలను వినాయకుడికి పెడతారు. ఆ రోజే భాద్రపద శుద్ధ చవితి. అప్పటి నుండి వినాయక చవితిని జరుపుకునే సంప్రదాయం మొదలైంది.

ఇది కూడా చదవండి:క్రోమ్, ఎడ్జ్, ఫైర్‎ఫాక్స్ వంటి బ్రౌజర్‎లు ఉపయోగిస్తుంటే తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే.!!

గణేశోత్సవం ప్రాముఖ్యత:

భాద్రపద చతుర్థి నాడు గణపతిని ప్రతిష్టించినప్పటి నుండి చతుర్దశి వరకు దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో గణపతి కొలువై ఉంటాడు. ఆయనకు మోదకమే కాదు, గణపతికి దూర్వాలు, నైవేద్యాలు కూడా ఇష్టం. ఈ పండుగలో గణేశుడికి అనేక వంటకాలు నైవేద్యంగా పెడతారు.

అందరినీ ఏకం చేసే మన మతాన్ని, సంస్కృతిని ఈ పండుగ తెలియజేస్తుంది. సామాజిక సామరస్యాన్ని పెంపొందించడానికి, మంచి ఆలోచనల మార్పిడికి, పేదలకు సహాయం చేయడానికి, వివిధ పోటీలను నిర్వహించడం ద్వారా ప్రజలలో మంచి లక్షణాలను పెంపొందించడానికి గణేషోత్సవం జరుపుకుంటారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ గణేష్ పండుగకు భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ పెద్ద వినాయక విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. చారిత్రక, పౌరాణిక, సామాజిక దృశ్యాలు చూడవచ్చు.

Latest News

More Articles