Monday, May 20, 2024

ఇంటర్నెట్‌ లేకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌లు

spot_img

వాట్సాప్‌ తో మెసేజ్ లు సెండ్ చేయాలంటే ఇంటర్నెంట్ తప్పని సరి. ఇయితే ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఇంటర్నెంట్ లేకుండానే వాట్సాప్ తో మెసేజ్ లు చేయవచ్చు. దీని కోసం ఇప్పుడు కొత్త ఫీచర్‌ వచ్చేసింది. నెట్‌ ఉన్నా లేకున్నా వాట్సాప్‌ను వాడొచ్చు. దీని కోసం ఓ ఫీచర్ ను యాక్టివేట్‌ చేసుకోవాలి.. ముందుగా వాట్సాప్‌ సెట్టింగ్స్ లోకి వెళ్లి స్టోరేజి అండ్‌ డేటా మీద క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత స్టోరేజి అండ్‌ డేటా ఓపెన్‌ చేశాక కిందకి స్క్రోల్‌ చేస్తే ప్రాక్సీ సెట్టింగ్స్‌  ఉంటుంది. ఒకవేళ ప్రాక్సీ సెట్టింగ్స్‌ కనిపించకపోతే వాట్సాప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. ప్రాక్సీ సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేసి ప్రాక్సీ అడ్రస్‌ సెట్‌ చేసుకోవాలి. కనెక్షన్‌ ఎస్టాబ్లిష్‌ అవ్వగానే ఒక చెక్‌ మార్క్‌ కనిపిస్తుంది. అప్పుడు ఇంటర్నెట్‌ లేకుండానే వాట్సాప్ తో ఛాటింగ్ చేసుకోవచ్చు.

అయితే.. ప్రాక్సీ ద్వారా వాట్సాప్‌ను ఉపయోగించడంతో ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ద్వారా సురక్షితంగా ఉంటుందని మాతృసంస్థ మెటా చెబుతోంది. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదని సైబర్‌ నిపుణులు సూచిస్తారు.

Latest News

More Articles