Monday, May 20, 2024

సినీ ఫక్కీలో పట్టుబడ్డ కిలోన్నర బంగారం..!

spot_img

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుసగా అక్రమ బంగారం పట్టుబడుతునే ఉంది. బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఒ వైపు డిఆర్ఐ ఆధికారులు మరో వైపు కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. ఆధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సినీ ఫక్కీలో ఇప్పటికి కిలోల కొద్దీ బంగారాన్ని విదేశాల నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నారు.

బంగారం కేటుగాళ్లు తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సినీ ఫక్కీలో కిలోన్నర కు పైగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన కేరళ ప్రయాణికుడు బంగారాన్ని పొడిగా తయారుచేసి తరలిస్థూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న అతని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితుడి వద్ద నుండి 1761 గ్రాముల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 1.10 కోట్లు ఉంటుందని అంచనా వేశారు‌. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితుడిపై విచారణ చేపట్టారు.

Latest News

More Articles