Monday, May 20, 2024

వన్డే ప్రపంచకప్ 2023: సెమీ ఫైనల్కు వెళ్లే జట్లు ఏవో చెప్పేసిన క్రికెట్ దిగ్గజాలు

spot_img

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023 కౌంట్ డౌన్ షురూ అయ్యింది. వచ్చే వారం వన్డే ప్రపంచకప్ ఘనంగా ఆరంభం కానుంది. తొలిసారిగా వన్డే ప్రపంచకప్కు ఇండియా ఆతిథ్యం ఇస్తుంది. అయితే ఈసారి జరగబోయే వన్డే వరల్డ్ కప్లో ఏఏ జట్లు సెమీ ఫైనల్ కు చేరుతాయనే చర్చ అప్పుడే మొదలైంది. 10మంది క్రికెట్ దిగ్గజాలు సెమీస్ కు వెళ్లే టీమ్ల గురించి తెలిపారు. అయితే వారందరు ఎంచుకున్న దానిలో టీమిండియా ఉండటం ఇక్కడ విశేషం. ఇటీవల ఆసియాకప్, ఆస్ట్రేలియా సిరీస్ గెలిచి టీమిండియా మంచి ఊపుమీద ఉంది.

Also Read.. 10మీ ఎయిర్ పిస్టల్ వ్య‌క్తిగ‌త ఈవెంట్‌లో పాల‌క్‌కు గోల్డ్ మెడల్

10 మంది క్రికెట్ దిగ్గజాలు చెప్పిన సెమీ ఫైనల్ జట్ల వివరాలు:

సునీల్ గవాస్కర్ : ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా

ముత్తయ్య మురళీధరన్ : ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్

గౌతమ్ గంభీర్:  ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్

ఇర్ఫాన్ పఠాన్ : ఇండియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా

షేన్ వాట్సన్ : ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్

ఆరోన్ ఫించ్ : ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్

సంజయ్ మంజ్రేకర్ : ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్

క్రిస్ గేల్ : ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్

రాబిన్ ఉతప్ప : ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్

జాక్వెస్ కల్లిస్ : ఇండియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా

Latest News

More Articles