Sunday, May 19, 2024

చెక్ యువర్ ఓట్.. జిహెచ్ఎంసి ప్రచారానికి విశేష స్పందన

spot_img

చెక్ యువర్ ఓటుపై జిహెచ్ఎంసి ద్వారా చేసిన అవగాహన ప్రచారానికి విశేష స్పందన వచ్చింది. మీలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ఓటరు నమోదుపై చెక్ యువర్ ఓటు అవగాహన కార్యక్రమం ముమ్మరంగా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మసీదు ల వద్ద చెక్ యువర్ ఓటు పై పోస్టర్లు కరపత్రాలు స్టాండులను ఏర్పాటుచేసి అవగాహన కల్పించడం విశేషంగా స్పందన కనిపించింది. చెక్ యువర్ ఓటు పై ప్రత్యేక కార్యక్రమం 18 సంవత్సరాల వయస్సు గల అర్హులైన వారు ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనే ముఖ్య ఉద్దేశ్యం తో కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యం మేరకు గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం పాండ్స్, మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు.

హైదరాబాద్ జిల్లాలో ఓటరు నమోదు, ఓటింగ్ శాతం పెంచే యోచనలో ఎన్నికల సంఘం నిర్దేశించిన నేపథ్యంలో ఓటరు నమోదు, పై జిహెచ్ఎంసి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అర్హులైన వారందరినీ ఓటరు నమోదు చేయడం, వారందరు ఓటు వేసే విధంగా అవగాహన కల్పించడం జరిగినది. ఓటరు నమోదు పై ఒక వైపు I vote for sure అనే నినాదంతో ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు టి-షర్ట్ ధరించి ప్రచారం చేస్తున్నారు.ఓటరు నమోదు తో పాటు ఓటింగ్ లో పాల్గొనే విధంగా వాలంటీర్లు అవగాహన కల్పిస్తున్నారు. ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లతో పాటుగా నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు కూడా చురుకుగా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు లేనివారు అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు వయసు నిండబోయే వారు ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలో పేరు తొలగింపు సేకరణ జరుగుతుంది .

ఇక, అభ్యంతరాల కోసం ఫారం-7, ఓటరు జాబితాలో చేర్పులు మార్పులకు ఫారం- 8 ద్వారా సవరణ చేసుకోవాలి అని వాలంటీర్లు ప్రజలకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక మిలాద్ ఉన్ నబీ వేడుకలతో పాటు గణేష్ నిమజ్జనం సందర్భంగా పెద్ద ఎత్తున చేస్తున్న అవగాహన కార్యక్రమాలు విశేష స్పందన వచ్చినట్లు కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 1950 హెల్ప్ లైన్ కు  సంప్రదించాలని అన్నారు.  మీ బూత్ లెవెల్ అధికారికి గాని ఈ.ఆర్.ఓ లకు  గాని కార్యాలయ పని వేళలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు అని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ తెలిపారు.

Latest News

More Articles