Sunday, May 19, 2024

స్పెయిన్‌లో భారీ అగ్నిప్రమాదం.. 24 మంది మృతి

spot_img

స్పెయిన్‌లోని 14 అంతస్తుల ఎత్తైన అపార్ట్ మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకునే క్రమంలో ప్రజలు కిందకి దూకేసినట్లు తెలుస్తోంది. పలువురు బాల్కనీల నుంచి దూకడంతో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరికొందరు మంటల్లోనే సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా 24 మంది చనిపోయినట్లు తెలుస్తోంది

ప్రస్తుతానికి నలుగురు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 14 మంది ఆచూకీ మాత్రం తెలియకుండా పోయిందని చెబుతున్నారు. మరో 13 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని పలువురిని కాపాడినట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేశారు.

మొదట ఓ భవనంలో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న మరో దానికి వ్యాపించినట్లు సమాచారం. అగ్నికీలలు, పెద్దఎత్తున పొగ వెలువడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ప్రమాదానికి గల కారణాలు ఇంక తెలియరాలేదు. మృతుల కుటుంబాలకు స్పెయిన్‌ ప్రధాని పెడ్రో షాంచేజ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి:బీబీసీ చైర్మన్‌గా మొదటి భారతీయుడు

 

Latest News

More Articles