Sunday, May 19, 2024

లక్నో జైలులో 47 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్

spot_img

లక్నో జైలులో ఖైదీలకు హెచ్‌ఐవీ సోకడంతో కలకలం మొదలైంది. యూపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల తో ఆరోగ్య శాఖ జైలులో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించింది. జైలులో కొత్తగా 36 మందికి హెచ్ఐవీ ఉన్నట్లుగా తేలింది. ఖైదీల ఈ పరీక్ష డిసెంబర్ 2023లో జరిగింది. దీంతో జైలులో మొత్తం 47 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకింది. ప్రస్తుతం ఈ వ్యాధి సోకిన రోగులందరికీ లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

డిసెంబర్ 2023లో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఈ రోగ నిర్ధారణ జరిగింది. దీని తర్వాత జైలు పరిపాలన అప్రమత్తమైంది. ఖైదీలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అందరూ KGMUలోని యాంటీ రెట్రో వైరల్ థెరపీ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ఖైదీలకు హెచ్ఐవీ సోకుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

స్క్రీనింగ్ సమయంలో వేలాది మంది ఖైదీలను పరీక్షించారు. ఇప్పుడు అలాంటి నివేదిక రావడంతో గందరగోళం నెలకొంది. వ్యాధి సోకిన ఖైదీల ఆహారం కూడా మార్చారు. అది కూడా పెరిగింది. ఇంత మంది ఖైదీలకు హెచ్‌ఐవీ ఎలా సోకింది అనే దానిపై ఆరోగ్య శాఖ ఆరా తీస్తోంది.

Latest News

More Articles