Saturday, June 22, 2024

లైంగిక ఆరోపణలపై 91 ఏళ్ల కెనడా బిలియనీర్ అరెస్టు

spot_img

కెన‌డాకు చెందిన బిలియనీర్ ఫ్రాంక్ స్ట్రోనాచ్‌ను అరెస్టు చేశారు పోలీసులు. అత్యాచారం,లైంగిక దాడి ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. టొరంటో శివారు ప్రాంత‌మై అరోరాలో 91 ఏళ్ల వ్యాపార‌వేత్త‌ ఫ్రాంక్ స్ట్రోనాచ్‌ అరెస్టు చేశారు. 1980 నుంచి 2023 వ‌ర‌కు బిలియ‌నీర్ ఫ్రాంక్‌ లైంగిక దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు పీల్ రీజిన‌ల్ పోలీసులు తెలిపారు. అయిదు నేరాభియోగాల‌పై ఫ్రాంక్ స్ట్రోనాచ్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ పై విడుదల అయ్యారు. అత‌ను ఆంటారియో కోర్టులో హాజ‌రుకానున్నారు.

ఫ్రాంక్ స్ట్రోనాచ్‌ పై రేప్‌, దాడి, లైంగిక వేధింపుల కేసుల్ని న‌మోదు చేశారు. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కూడా పోలీసులు అప్పీల్ చేశారు. కెన‌డా మ్యాగ్నా ఇంట‌ర్నేష‌న‌ల్ వ్య‌వ‌స్థాప‌కుడు స్ట్రోనాచ్. ఆ కంపెనీ ఆటోమొబైల్ పార్ట్స్ ను ఉత్ప‌త్తి చేస్తుంది. 2010లో కంపెనీ నియంత్రణను వదులుకున్నప్పటి నుంచి స్ట్రోనాచ్ కు మాగ్నాఇంటర్నేషనల్ తో ఎలాంటి అనుబంధం లేదని..అంతేకాదు  అతనిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన త‌ర‌పు లాయ‌ర్ బ్రియాన్ గ్రీన్‌స్పాన్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి:భర్తలను వదిలేసి ఇద్దరు వివాహితలు సహజీవనం

Latest News

More Articles