Tuesday, May 21, 2024

‘ప్రజాపాలన’లో 2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు

spot_img

హైదరాబాద్:  రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన  ప్రజా పాలన కార్యక్రమంలో అయిదు గ్యారంటీలకు 1,09,01,255 దరఖాస్తులు నమోదయ్యాయి. జనవరి 12వ తేదీ నాటికే రికార్డు టైమ్ లో డేటా ఎంట్రీ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. కొందరు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లు డేటా బేస్ ద్వారా గుర్తించారు.

మొత్తం దరఖాస్తుల్లో  2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు గుర్తించారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల నెంబర్లు లేకుండా ఉన్నవి, నెంబర్లు తప్పుగా ఉన్న దరఖాస్తులు కూడా ఇందులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రజాపాలన దరఖాస్తులపై గురువారం సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Also Read.. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు.. 6 కేసులు కొట్టేసిన నాంపల్లి కోర్టు

Latest News

More Articles