Wednesday, May 22, 2024

కొత్తఏడాది భారీ షాక్..ఈరోజు నుంచి ఈ 4 బ్యాంకులు కనిపించవు!

spot_img

బ్యాంకు వినియోగదారులకు భారీ షాకిచ్చింది ఆర్బీఐ. కొత్త ఏడాది ఆరంభంలోనే ఆర్బీఐ ఝలక్ ఇచ్చింది. బ్యాంకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు కో ఆపరేటివ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసింది. దీంతో ఆ బ్యాంకు అకౌంట్ కలిగిన వారిపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఆర్బీఐ బోటడ్ పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది ఆర్బీఐ.  దీన్ని ఇకపై నాన్ బ్యాంకింగ్ ఇన్ స్టిట్యూషన్ గా మాత్రమే ఆర్బీఐ గుర్తించింది. ఇకపై బోటడ్ పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఇక బ్యాంకింగ్ కార్యలాపాలు నిర్వహించడం కుదరదు.

ఆదర్శ్ మహిళానగరి సహకారి బ్యాంక్ లైసెన్స్ కూడా ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది. ఈ బ్యాంకు కూడా ఇకపై బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడం కుదరదు. ఇప్పటికే ఆర్బీఐ సంబంధిత బ్యాంక్ లిక్విడేషన్ ప్రక్రియకు కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆప్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఆఫ్ మహారాష్ట్రకు బదలాయిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులో కావాల్సినంత మూలధనం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంక్ కార్యకలాపాలను ఈ విధంగానే కొనసాగిస్తే వినియోగదారులకు మరింత ఇబ్బంది తలెత్తవచ్చని అందుకే లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ వివరణ ఇచ్చింది.ఫైజ్ మర్చంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ తోపాటు ముసిరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: కొత్త సంవత్సరం మొదటి రోజు ఏమి చేయాలి..? ఏమి చేయకూడదు?

Latest News

More Articles