Sunday, May 12, 2024

ట్రాన్స్ జెండర్ల వేషంలో బెగ్గింగ్, వసూళ్లు. బిహారీ ముఠా అరెస్ట్

spot_img

హైదరాబాద్‌: నగరంలో మరో బెగ్గింగ్ ముఠాను పోలీసులు ఛేధించారు. చిన్న పిల్లలు, వృద్ధులను తీసుకువచ్చి నగరంలో బెగ్గింగ్ చేయిస్తో్న్న ముఠాను అదుపులోకి విచారణ చేస్తుండగానే.. తాజాగా మరో ముఠా గుట్టురట్టు చేశారు.

సికింద్రాబాద్, ప్యారడైజ్, జూబ్లీబస్టాండ్‌తో ఇతర ప్రధాన జంక్షన్ల దగ్గర ట్రాన్స్ జెండర్ల వేషంలో బెగ్గింగ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పలువురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని 15 మంది నకిలీ ట్రాన్స్ జెండర్లు.. ఐదుగురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

బీహార్ కి చెందిన ఈ గ్యాంగ్ సభ్యులు ఆడవారిలా తయారై ఇండ్లు, షాప్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద హంగామా చేస్తూ బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.

Latest News

More Articles