Monday, May 20, 2024

రామేశ్వ‌రం కేఫ్‌ బ్లాస్ట్: అమ్మ ఫోన్ కాల్ నా ప్రాణాల‌ను కాపాడింది

spot_img

బెంగ‌ళూరు న‌గ‌రంలోని రామేశ్వ‌రం కేఫ్‌లో నిన్న(శుక్రవారం) మ‌ధ్యాహ్నం 12:56 గంట‌ల‌కు బాంబు బ్లాస్ట్ జ‌రిగింది. అదే స‌మ‌యంలో అమ్మ ఫోన్ కాల్ చేయ‌డంతో తాను ప్రాణాల‌తో సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డాన‌ని ఓ యువ‌కుడు తెలిపాడు. లేదంటే తాను కూడా పేలుడు ధాటికి గాయ‌ప‌డే వాడిన‌న్నాడు.

బెంగ‌ళూరులో ఇంజినీర్‌గా ప‌ని చేస్తున్న కుమార్ అలంకృత్ ..ఆఫీసు రామేశ్వ‌రం కేఫ్‌కు స‌మీపంలోనే ఉంది. నిన్న మ‌ధ్యాహ్నం లంచ్ కోసం  కేఫ్‌లోకి వెళ్లాడు. ఇడ్లీ, దోస ఆర్డ‌ర్ కూడా చేశాడు. అంత‌లోనే కుమార్ వాళ్ల అమ్మ ఫోన్ చేయ‌డంతో కేఫ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. కేఫ్‌కు 15 మీట‌ర్ల దూరంలో ఉండి.. అమ్మ‌తో ఫోన్ మాట్లాడుతుంటే పెద్ద శ‌బ్దం వినిపించింది. ఆ శ‌బ్దానికి కాసేపు చెవులు ప‌ని చేయ‌లేదు. అంద‌రూ ప‌రుగులు పెడుతున్నారు. ఆ ప్రాంతమంతా పొగ‌తో నిండిపోయింది. గ్యాస్ సిలిండ‌ర్ పేలింద‌ని అనుకున్నట్లు తెలిపాడు. కేఫ్‌లోకి వెళ్లి చూడ‌గా ఓ మ‌హిళ చేతికి తీవ్ర గాయ‌మైంది. ర‌క్తం కారుతుంది. ఆమె వ‌య‌సు 80 ఏళ్లు ఉంటుంది. మ‌రో మ‌హిళ శ‌రీరం కాలిపోయింది. కేఫ్ సిబ్బంది ఒక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని కుమార్ తెలిపాడు.

ఇది కూడా చదవండి: ముంబై బాంబు పేలుళ్ల కీలక సూత్రధారి మృతి

Latest News

More Articles