Monday, May 20, 2024

బీజేపీకి ఎంపీ జయంత్ సిన్హా రాజీనామా

spot_img

బీజేపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు.  రానున్న లోక్‌సభ ఎన్నికలలో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించవద్దని బీజేపీకి ఎంపీ జయంత్ సిన్హా పార్టీ అధిష్టాన వర్గాన్ని కోరారు. ప్రత్యక్ష ఎన్నికల బాధ్యతల నుంచి తనను తప్పించాలని కోరుతూ ఇవాళ (శనివారం) పార్టీ అధ్యక్షుడు జెపీ నడ్డాకు లేఖ రాశానని జార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ఎక్స్ వేదికగా తెలిపారు. భారత్‌తో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలలో వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా తాను కృషి చేయవలసి ఉందని ఆయన తెలిపారు.

అయితే ఆర్థిక, పాలనాపరమైన అంశాలకు సంబంధించి పార్టీ కోసం తన సేవలను కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఈ ఇద్దరు ఎంపీలకు మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కకపోవచ్చని, అందుకే వీరు ముందుగానే తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారని ఊహాగానాలు సాగుతున్నాయి. పలువురు సిట్టింగ్ ఎంపీల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని బీజేపీ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి:రామేశ్వ‌రం కేఫ్‌ బ్లాస్ట్: అమ్మ ఫోన్ కాల్ నా ప్రాణాల‌ను కాపాడింది

Latest News

More Articles