Wednesday, May 22, 2024

మంచానపడిన మామకు నిప్పంటించిన కోడలు.. వైరల్ వీడియో

spot_img

ఆ వృద్ధుడు కష్టపడి తన పిల్లల్ని ప్రయోజకుల్ని చేశాడు. వారికి పెళ్లిళ్లు చేసి, బాధ్యతలు చక్కగా నెరవేర్చాడు. ఇప్పుడు వృద్ధాప్యభారంతో మంచాన పడ్డాడు. ఆయనకు సపర్యలు చేయడం ఇష్టంలేని కోడలు ఆయన మంచానికి నిప్పుపెట్టింది. మంచంపై నిద్రిస్తున్న మామ మీదకు పేపర్‎కు మంట పెట్టి విసిరేసింది ఆ కోడలు. గమనించిన ఆ వృద్ధుడి కొడుకు.. వెంటనే మంటలు ఆర్పివేశాడు. భార్య నిర్వాకాన్ని మొత్తం ఆమె భర్త వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Read Also: వరుస విజయాలతో ఊపుమీదున్న టీంఇండియాకు భారీ షాక్

తన తండ్రిని చంపాలనే ఉద్దేశంతోనే తన భార్య ఈ పని చేసిందని అతను ఆరోపిస్తున్నాడు. ఓ పేపర్‎కు నిప్పంటించి, కాలుతున్న ఆ పేపర్‎ను మామ బెడ్ పై పడేసింది. బట్టలకు నిప్పంటుకుని మంటలు ఎగసిపడితే అందులో పడి మామ చనిపోతాడనే ఉద్దేశంతో చేసినట్లు అర్థమవుతోంది. అప్పటికే జరుగుతున్న గొడవను ఫోన్‎లో రికార్డు చేస్తున్న ఆమె భర్త వెంటనే స్పందించి, బెడ్‎కు మంటలు అంటుకోకుండా పేపర్‎ను కిందకు తోసేశాడు. ఈ హడావిడికి నిద్రలో నుంచి మేల్కొన్న వృద్ధుడు.. తన బెడ్ పై మంటలు చూసి షాక్‎కు గురయ్యాడు.

Read Also: ప్రేమపేరుతో ఒకరు.. బెదిరించి మరొకరు.. బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం

కాగా.. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచానికి పరిమితమైన వృద్ధుడిపై ఈ దాష్టీకం ఏంటని తీవ్రంగా మండిపడుతున్నారు. తండ్రిలాంటి వ్యక్తి పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.

Latest News

More Articles