Sunday, June 2, 2024

క్రికెట్ ఆడుతున్న విద్యార్థిపై దుండగుల దాడి..

spot_img

క్రికెట్ ఆడుతున్న ఓ విద్యార్థి మీద దుండగులు దాడిచేసిన ఘటన హైదరాబాద్‎లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్‎లోని పార్శీగుట్టలో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధి సూరజ్ ఈ నెల 26న తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు సూరజ్ మీద దాడికి దిగారు. రాయితో సూరజ్ తల మీద దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సూరజ్‎ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సూరజ్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. సూరజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సూరజ్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ముషీరాబాద్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles