Sunday, May 19, 2024

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‎కు మధ్యంతర బెయిల్

spot_img

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి, జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‎కు బెయిల్ లభించింది. ఆయనకు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెయిల్ ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం.. బెయిల్ మంజూరు చేసింది. జైన్ కోరుకుంటే ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా చికిత్స పొందవచ్చునని కోర్టు స్పషం చేసింది. జులై 10వ తేదీ వరకు చికిత్సల నివేదికను సమర్పించాలని జైన్ తరపు న్యాయవాదికి సూచించింది. కాగా.. మధ్యంతర బెయిల్ కారణంగా.. జైన్ మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది.

Latest News

More Articles