Saturday, May 4, 2024

నేను జేఈఈ చేయలేను.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

spot_img

రాజస్థాన్‌లోని కోటాలో జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ)కి సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఇవాళ( శుక్రవారం) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన అభిషేక్ కుమార్ కోటాలోని విజ్ఞాన్ నగర్‌లో తాను అద్దెకు ఉంటున్న గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

అభిషేక్ విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘‘సారీ నాన్నా… నేను జేఈఈ చేయలేను’’ అని తన తండ్రిని ఉద్దేశించి రాసిన సూసైడ్‌ నోట్‌ గదిలో లభ్యమైంది.  కోచింగ్ సెంటర్‌లో జనవరి 29, ఫిబ్రవరి 19న జరిగిన రెండు పరీక్షలకు అభిషేక్‌ హాజరుకాలేదని పోలీసులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో జిల్లా యంత్రాంగం కౌన్సెలింగ్ సౌకర్యాలను అందించడానికి, కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వారి ఆత్మహత్యలు ఆగట్లేదు. గత ఏడాది 26 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోడా.. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే అరడజను కేసులు నమోదవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవడంతో కేంద్రం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా శిక్షణ ఇవ్వాలని సూచించింది. అటు విద్యార్థుల ఆత్మహత్యలను నియంత్రించేందుకు భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్‌ ఫ్యాన్లను అమర్చారు. అయినప్పటికీ ఇవి ఆగకపోవడం కలవరపెడుతోంది.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు.. గుడ్డిగుర్రం

Latest News

More Articles