Friday, May 17, 2024

ఖమ్మంలో సెప్టెంబర్ 1న అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

spot_img

ఖమ్మం: ఖమ్మం డి.పి.ఆర్.సి సమావేశ మందిరంలో అగ్నివీర్ ర్యాలీ( ఆర్మీ రిక్రూమెంట్) పై  జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, రిక్రూట్మెంట్ ఆఫీసర్ కన్లల్ కోలోనెల్ కీట్స్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్  మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వీపి గౌతమ్ మాట్లాడుతూ.. అగ్ని వీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ  సెప్టెంబర్ 1వ తేదీ తెల్లవారుజామున 2.30 నిమిషాలకు ప్రారంభం అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత సాధించిన 7500 మంది అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఇప్పటికే వాళ్లు పరీక్షలు రాసి సెలెక్ట్ అయి ఉన్నారు, ఫిజికల్ టెస్ట్ కు ఇక్కడికి వస్తారు. సర్దార్ పటేల్ స్టేడియంలో రన్నింగ్ ఇతర ఫిజికల్  ఎగ్జామీన్  నిర్వహిస్తాం. జాబ్స్ ఇప్పిస్తామనే దళారులను నమ్మి మోసపోవద్దు. ఎంతో పారదర్శకంగా ఆర్మీ ఉద్యోగ ప్రక్రియ ఉంటుంది. అడ్మిట్ కార్డులో అభ్యర్థులు ఏఏ డేట్ తో, ఏ టైంలో రావాలో ఉంటుందన్నారు.

సీపీ విష్ణు వారియర్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో ఏడు రోజుల్లో 7,500 మంది అభ్యర్థులను ఫిజికల్, రన్నింగ్ టెస్టు చేయడం జరుగుతుందన్నారు. ఆగస్టు 31 నైట్ నుంచి అభ్యర్థులు వస్తారు, సెప్టెంబర్ 1వ తేదీ నుండి రన్నింగ్, ఫిజికల్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది.  అధికారులు సూచించిన డాక్యుమెంట్లను అభ్యర్థులు తప్పనిసరిగా  తీసుకొని రావాలి. దళారులను నమ్మి మోసపోవద్దు, అటువంటి వ్యక్తులు ఎవరైనా మీ దృష్టికి వస్తే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Latest News

More Articles