Monday, May 20, 2024

ఉద్యోగులకు ఎయిరిండియా షాక్..25 మంది తొలగింపు..!

spot_img

25 మంది క్యాబిన్ సిబ్బందిని తొలగించింది ఎయిరిండియా ఎక్స్ ప్రెస్. మిగిలినవారు గురువారం సాయంత్రం 4గంటల్లోగా విధుల్లో చేరాలని ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేసింది. లేదంటే వారందర్నీ కూడా తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. 300మంది ఉద్యోగుల మూకుమ్మడి అనారోగ్య సెలవుతో విమానాలు రద్దు అయిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ మరింత మందిని తొలగించే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. సెలవుల్లో ఉన్న సిబ్బందితో సంస్థ ప్రతినిధులు ఈరోజు సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలిపాయి. ఈరోజు దాదాపు 60 సర్వీసులను రద్దు చేసింది.

ముందస్తు ప్రణాళికలో భాగంగానే మూకుమ్మడి సెలవుపై వెళ్లినట్లు స్పష్టంగా అర్థం అవుతుందని 25మందికి పంపిన తొలగింపు లేఖలో కంపెనీ తెలిపింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపింది సంస్థ ప్రతిష్టకు నష్టం వాటిల్లిందని కంపెనీ పేర్కొంది. ఇది పూర్తిగా సంస్థ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. అందుకే ఈ చర్యలు తీసుకోవల్సి వస్తుందని వివరణ ఇచ్చింది.

కాగా ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి క్యాబిన్ సిబ్బందిలోని ఓ వర్గం తీవ్ర అసంత్రుప్తిగా ఉంది. ఉద్యోగులతో కంపెనీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని 300 మంది క్యాబిన్ సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆరోపించింది. కొత్త ఒప్పందంలో భాగంగా తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులను ఇవ్వటంతో పాటు సిబ్బంది మొత్తాన్ని సమానంగా చూడటం లేదని పేర్కొంది. సంస్థలో మొత్తం 1400 మంది క్యాబిన్ సిబ్బంది ఉండగా..వీరిలో 500మంది సీనియర్ స్థాయి ఉద్యోగులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై..కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్.!

Latest News

More Articles