Monday, May 20, 2024

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై..కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్.!

spot_img

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆగమైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పదేండ్ల కాలంలో రెప్పపాటు కూడా కరెంటు పోలేదని..ఇప్పుడు ఎప్పుడు కరెంటు వస్తుందో పోతుందో అర్థం కావడం లేదంటున్నారు. మండుతున్న ఎండలతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతుంటే ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తున్నారు. రాష్ట్రంలో డిమాండ్ కు సరిపడా విద్యుత్ సరఫరా అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కరెంటు కోతలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..కాంగ్రెస్ సర్కార్ పై సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలంతా ఇన్వర్టర్లు, చార్జింగ్ బల్బులు, క్యాండిళ్లు, పవర్ బ్యాంకులు, జనరేటర్లు, టార్చిలైట్లను రెడీగా ఉంచుకోవాలని సూచించారు. ఇవే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఇది బీఆర్ఎస్ సర్కార్ కాదని..కాంగ్రెస్ సర్కార్ అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. మే 13న ఓసారి ఆలోచించి ఓటు వేయాలని సూచించారు కేటీఆర్.

ఇది కూడా చదవండి:నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు..రూ25లక్షల వరకు జీతం.!

Latest News

More Articles