Monday, May 20, 2024

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు..రూ25లక్షల వరకు జీతం.!

spot_img

నిరుద్యోగులకు శుభవార్త. ఇండిపోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్టు ప్రాతిపదికన చేపట్టే ఈ 54 పోస్టులకు అర్హులన వారు మే 24వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్, బీఎస్సీ, ఎంసీఏ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు హోదాను బట్టి రూ. 25లక్షల వరకు వార్షిక వేతనాన్ని చెల్లిస్తారు.

మొత్తం పోస్టులు : 54
– ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) 28 పోస్టులు
-ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) 21
-ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్): 5 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు: బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు ఆయా పోస్టులను బట్టి కనీసం ఏడాది నుంచి 3ఏండ్లు పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

జీతం: ఎగ్జిక్యూటివ్ పోస్టుకు ఏడాదికి రూ. 10,00,00 , ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.15,00,000, ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ పోస్టుకు రూ. 25,00,000 చొప్పున చెల్లిస్తారు.

ఎంపిక: అసెస్ మెంట్, ఆన్ లైన్ టెస్టు, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రు. 750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 150 చెల్లించాలి.

ఇందులో ఎంపికైన వారికి ఢిల్లీ, ముంబై, చెన్నైలో పనిచేయాలి. ఆ తర్వాత దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టులకు 22 నుంచి 30ఏండ్ల వయస్సు ఉండాలి. కన్సల్టెంట్ పోస్టులకు 22 నుంచి 40ఏండ్లు, సీనియర్ కన్సల్టెంట్ కు 22 నుంచి 45 ఏండ్లు ఉండాలి.

ఇది కూడా చదవండి: కరెంట్ కోతలు, నీటి సమస్యలతో..సిటీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్:కేసీఆర్

Latest News

More Articles