Monday, May 20, 2024

కరెంట్ కోతలు, నీటి సమస్యలతో..సిటీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్:కేసీఆర్

spot_img

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ లో బుధవారం మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కేసీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని..నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందన్నారు. నీళ్లు లేవు, కరెంటు ఉండటం లేదు. వీటికి కారణంగా అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు. లండన్, న్యూయార్క్ లో కరెంటు పోతుందేమో కానీ తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చేసి చూపించాము.

మేము అధికారంలో ఉన్నసమయంలో భూముల రేట్లు ఎలా ఉండేది..ఇప్పుడు ఎలా ఉన్నాయంటూ ప్రశ్నించారు. త్రిబుల్ ఆర్ ట్యాక్స్ పై వసూలు చేసిన ఢిల్లీకి కప్పం కడుతున్నారంటూ మోదీ ఆరోపించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ లో కొద్దిపాటి వర్షానికే ఆరగంటల కరెంటు పోయే దుస్థితిని నగరం వచ్చిందన్నారు. తాను సీఎంగా ఉన్న సమయంలో కార్మింగ్ అనే పరిశ్రమ హైదరాబాద్ లో వెయ్యికోట్లతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత దివాళ కోరు పరిపాలన విధానంతో..అది చెన్నైకి తరలిపోయిందన్నారు. పరిశ్రమలు తరలిపోతూ ఐటీ రంగంపూర్తిగా కుదేలైందన్నారు కేసీఆర్.

ఇది కూడా చదవండి: మరో ఐదురోజుల పాటు వర్షాలు..తగ్గిన ఉష్ణోగ్రతలు.!

Latest News

More Articles