Monday, May 20, 2024

మరో ఐదురోజుల పాటు వర్షాలు..తగ్గిన ఉష్ణోగ్రతలు.!

spot_img

రాష్ట్రంలో ఉక్కపోత తగ్గింది. నిప్పుల కొలిమిలా తయారైన రాష్ట్రానికి అకాల వర్షాలు ఉపశమనం కలిగించాయి. మంగళవారం కురిసిన భారీ వర్షానికి రాష్ట్రం తడిసి ముద్దయినప్పటికీ..ప్రజలకు మాత్రం ఎండల నుంచి ఉపశమనం కలిగింది. హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి పది మంది మరణించారు. వేసవిలో ఈ స్థాయిలో వర్షం ఈసారి మొదటి కావడంతో రికార్డు నమోదు చేసింది. కాగా రాష్ట్రంలో రానున్న 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. మంగళవారం ద్రోణి ప్రభావంతో భారీ వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. వచ్చే 4 రోజులు వాతావరణం చల్లగా ఉండి..అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

ఎన్నికలు జరిగే 13వ తేదీన కూడా తెలంగాణ, ఏపీలో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘాలతో కప్పి ఉంటుందని గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలుగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉష్ణోగరత గరిష్టంగా 40 డిగ్రీలుగా, కనిష్టం 21.9 డిగ్రీలుగా నమోదు అయినట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఎన్నికల విధులకు గైర్హాజరైన 40మంది సస్పెన్షన్..!

Latest News

More Articles