Monday, May 20, 2024

ఎన్నికల విధులకు గైర్హాజరైన 40మంది సస్పెన్షన్..!

spot_img

పార్లమెంట్ ఎన్నికల డ్యూటీలకు హాజరుకానీ పలు విభాగాలకు చెందిన 40 మంది అధికారులపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ సస్పెన్సన్ వేటు వేశారు. ఎన్నికల ట్రైనింగ్ కు హాజరుకావాలంటూ ఎన్నిసార్లు మెసేజ్ లు పంపించినా హాజరుకాకపోవడంతో వారిపై సస్పెన్షన్ వేసినట్లు వివరించారు. ప్రజాప్రాతినిథ్యం చట్టం ఉల్లంఘన కింద వారందర్నీ సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రిసైడింగ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు తిరిగి 9,10 వ తేదీల్లో మూడవ దశ ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. ఆ ట్రైనింగ్ క్లాసెస్ కు గైర్హాజరయ్యే వారిపై కూడా ఇవే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాలేజ్ ఆఫ్ సైన్స్‌కు చెందిన జె.వెంకటేశ్వరరావు, డాక్టర్ బి.అశోక్, డాక్టర్ బి.రవీందర్‌రెడ్డి, డాక్టర్ పీ.సోమేశ్వర్, నిజాం కాలేజీకి చెందిన డాక్టర్ ఎం.లక్ష్మణ్, డాక్టర్ అప్క నాగేశ్వరరావు, పరిమళ కులకర్ణి, కోఠి ఉమెన్స్ కళాశాలకు చెందిన డాక్టర్ పీఆర్.సుష్మా, కే.దత్తాత్రేయ, డాక్టర్ ప్రియకుమారి, ఓయూ మెయిన్ క్యాంపస్‌కు చెందిన చింతపట్ల శ్రీనివాస్, జి.శ్రావన్య, డీఆర్ డీఎల్‌కు చెందిన ఎల్.యుగంధర్, కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సైదా శ్యాం అలియా, కె.సరిత స్కూల్  ఎడ్యుకేషన్ శాఖకు చెందిన కే.యాదవరెడ్డి, ఎం.సుహాసిని, మహ్మద్ సలావుద్దీన్, హఫ్స ఖుద్సియ, జకిర షహీన్, గీత, కే.మాధురి, బీ.పావని, సీఆర్.అరుణకుమారి, ఎస్.మరియా గోరెట్టి, ఆర్.లక్ష్మణ్ కుమార్, శ్రీలత, రవి నిరంజని, ఏ.రాధ, డీ. నాగరాజు, వీ.కవిత, సాదిక్ ఉన్నిసా బేగమ్, ఎం.మోహన్ రాజ్, టీ.శౌరిలమ్మ, పీ.శుభ చైత్ర, ఈ.వేణుగోపాల్, మొహమ్మద్ షమీ యుద్దీన్, మహమ్మద్ అయూబ్ ఖాన్, ఖాజా తాఖీయుద్దీన్, చల్లా శ్రీనివాస్‌రెడ్డిలను  సస్పెండ్ చేయాలని ఆయా శాఖలకు సిఫార్సులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ తెలిపారు.

Latest News

More Articles