Sunday, May 19, 2024

ఎయిర్ టెల్ బంపర్ ప్లాన్..తక్కువ ధరకే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..!!

spot_img

ఎయిర్ టెల్ భారతదేశంలోని ప్రధాన టెలికం కంపెనీల్లో ఒకటిగా పేరుగాంచింది. ఈ కంపెనీ తన మిలియన్ల మంది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా పలు రకాల ప్లాన్స్ అందిస్తోంది. చాలా మంది నెలవారీ ప్లాన్స్ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. మీరు కూడా ఒక నెలకు తక్కువ ధరలో ఏదైనా కొనాలనుకుంటే అప్పుడు మీరు ఎయిర్ టెల్ రూ. 199 ప్లాన్ ను పొందవచ్చు.

ఈ ఎయిల్ టెల్ ప్లాన్ 30రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ 30రోజుల వాలిడీటిని మాత్రమే అందిచదు. బదులుగా కస్టమర్లకు 300ఎస్ఎంఎస్ లు లోకల్ ఎస్టిడి రోమింగ్ అన్ లిమిటెడ్ కాలింగ్ ను కూడా అందిస్తుంది. ఎస్ఎంఎస్ లు వాడకపోతే..వాటిని తర్వాత నెలకు ఇవ్వరు. ప్లాన్ మళ్లీ రీఛార్జ్ చేసుకున్నా వాటిని ఇవ్వరు.

ఇక డేటా గురించి మాట్లాడితే…వినియోగదారులు మొత్తం 3జీబీ డేటా ఇస్తుంది. డేటా పరిమితి దాటితే కస్టమర్లకు 50ఎంబి చొప్పున ఛార్జ్ చేస్తారు. మీకు అదనపు డేటా కావాలంటే మాత్రం మీరు డేటా వోచర్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయోజనాలతోపాటు ఈ ప్లాన్ తో ఫ్రీ హలో ట్యూన్స్, ఫ్రీ వింక్ మ్యూజిక్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. డేటాతో కాలింగ్ ప్లాన్ కావాలనుకునేవారికి ఇది అంతగా ఉపయోగపడదనే చెప్పవచ్చు. నెలవారీ అపరిమిత కాలింగ్ కావాలనుకునేవారికి ఇది బాగుంటుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా..!!

Latest News

More Articles