Saturday, May 18, 2024

హైద‌రాబాద్‌కు మరో భారీ ఫైనాన్షియల్ కంపెనీ.. 9 వేల ఉద్యోగాలు

spot_img

హైద‌రాబాద్‌: తెలంగాణ పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తాజాగా బ్యాంకింగ్, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో టాప్ కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన అలియంట్ గ్రూపు సంస్థ .. హైద‌రాబాద్‌లో కొత్త సెంట‌ర్‌ను ఏర్పాటు చేయనున్నది.

అలియంట్ కంపెనీకి చెందిన సీఈవో ధ‌వ‌ల్ జాద‌వ్‌ను హూస్ట‌న్‌లో మంత్రి కేటీఆర్ క‌లిసి కంపెనీ ఏర్పాటుపై చర్చించారు. ట్యాక్స్‌, అకౌంటింగ్‌, ఆడిట్ స‌ర్వీస్‌, ఐటీ టెక్నాల‌జీకి చెందిన యువ‌త‌కు ఇది మంచి అవకాశం అవుతుంద‌ని మంత్రి అభిప్రాయపడ్డారు.  హైదరాబాద్ కేంద్రంలో ఆ సంస్థ కొత్త‌గా 9 వేల మందిని రిక్రూట్ చేయ‌నున్న‌ట్లు కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Latest News

More Articles