Monday, May 20, 2024

నాణ్యమైన విద్య కోసం అమోజాన్ రన్ ఫర్ ఛేంజ్

spot_img

దేశంలో అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ అమెజాన్ నాణ్యమైన విద్యకోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రముఖ విరాళాల ప్లాట్‌ఫామ్ అయిన గివ్ ఇండియాతో కలిసి అమెజాన్ తమ రన్ ఫర్ ఛేంజ్‎ను శనివారం హైదరాబాద్‎లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుచేసింది. రన్ ఇండియా రన్ భాగస్వామ్యంతో నిర్వహించబడిన ఈ 5 కి.మీ పరుగును ప్రముఖ నటుడు మిలింద్ సోమన్ జెండా ఊపి ప్రారంభించారు. దాదాపు 3000 మందికి పైగా అమెజోనియన్లు మరియు వారి కుటుంబ సభ్యులు నాణ్యమైన విద్యకు తమ మద్దతును అందించడానికి ఈ రన్‌లో పాల్గొన్నారు.

సమాజానికి తిరిగి ఇవ్వాలనే తమ మిషన్‌లో భాగంగా అమెజాన్ ‘గ్లోబల్ మంత్ ఆఫ్ వాలంటీరింగ్‌’ నిర్వహిస్తోంది. నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నంలో భాగంగా, ప్రతి 2.5 కి.మీ దూరానికి గాను ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి స్కూల్ కిట్‌ను అమెజాన్ విరాళంగా ఇస్తుంది. అంతేకాకుండా ప్రతి 1 కి.మీ దూరానికి గాను ఒక చెట్టును నాటుతుంది. ఈ రన్‎లో పాల్గొనేందుకు వచ్చిన వారి నుంచి వచ్చిన రిజిస్ట్రేషన్ ఫీజుకు మూడింతలు కలిపి గివ్ ఇండియాకు విరాళంగా అందిస్తుంది. ఈ గ్లోబల్ ప్రయత్నం 2022లో మొదటిసారిగా ప్రారంభించబడింది. దాదాపు 50కి పైగా దేశాలలో ఉన్న అమోజాన్ ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారు.

ఈ రన్ ఫర్ ఛేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మిలింద్ సోమన్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఈ రన్‌ను జెండా ఊపి ప్రారంభించటం ఒక గౌరవంగా భావిస్తున్నాను. నా మనసుకు నచ్చిన అంశంతో కలిసి స్వచ్ఛందంగా పనిచేయడం నాకు ఎల్లప్పుడూ సంతోషం కలిగిస్తూనే ఉంటుంది. ఒక లక్ష్యం కోసం ఈ రన్‎లో పాల్గొనడానికి వేలాదిగా వచ్చిన నగరవాసులను చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోయింది’ అని అన్నారు.

Latest News

More Articles