Tuesday, May 21, 2024

బీఆర్ఎస్ లోకి అంబర్ పేట శంకర్

spot_img

ఈ రోజు మంత్రి హరీష్ రావు సమక్షంలో, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో అంబర్ పేట శంకర్ గా ప్రసిద్ధి చెందిన చిన్నబోయిన శంకర్ ముదిరాజ్ బీఆర్ఎస్ లో చేరారు. శంకర్ తో పాటు రాఘవేంద్ర ముదిరాజ్, సాయికిరణ్ ముదిరాజ్, రమణ, నజయ్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా అంబర్ పేట శంకర్ కి కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ని భారీ మెజారిటీతో గెలిపించుకుని, అంబర్ పేట గడ్డపై మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని తెలిపారు.

Latest News

More Articles