Monday, May 20, 2024

పిల్లలు పుట్టకుండా ఇంజెక్షన్.. త్వరలోనే మార్కెట్లోకి

spot_img

చాలామంది మగవారు పిల్లలు పుట్టకుండా వ్యాసెక్టమీ చేయించుకుంటుంటారు. అయితే అందులోనూ కొన్ని ప్రతికూలతలు ఉండటంతో.. ఐఐటీ-ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకుడు డాక్టర్‌ సుజోయ్‌ కె గుహ నేతృత్వంలోని బృందం ఓ ఇంజెక్షన్‎ను అభివృద్ధి చేసింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ‘ఇంజెక్టబుల్‌ మేల్‌ కాంట్రాసెప్టివ్‌’ను తీసుకువస్తున్నది. దీని ద్వారా ప్రపంచంలోనే మొదటిసారిగా పురుషుల్లో శుక్రకణాల విడుదలను నిలువరించవచ్చు. ఇందుకోసం రివర్సబుల్‌ ఇన్‌హిబిషన్‌ ఆఫ్‌ స్పెర్మ్‌ అండర్‌ గైడెన్స్‌ (ఆర్‌ఐఎస్‌యూజీ) పద్ధతిని ఫాలో అవనున్నారు.

Read Also: లాభాలు తగ్గాయని లేఆఫ్‎కు సిద్ధమైన నోకియా.. త్వరలోనే 14 వేల మంది అవుట్

ఈ ఇంజెక్షన్ మీద డ్రగ్స్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ జనరల్‌ ఇండియా అనుమతితో మూడో ట్రయల్స్‌ కూడా పూర్తి చేశారు. ఢిల్లీ, ఉదంపూర్‌, లూధియానా, జైపూర్‌, ఖరగ్‌పూర్‌లోని దవాఖానల్లో ఈ ట్రయల్స్‌ నిర్వహించారు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చిన 25 నుంచి 40 ఏండ్ల మధ్య వయసున్న 303 మంది ఆడ, మగవారిపై ట్రయల్స్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫేజ్‌3 ట్రయల్స్‌ ఫలితాలను ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ యాక్సెస్‌ ఆండ్రాలజీ జర్నల్‌లో ప్రచురించారు. ఇంజెక్షన్‌ సమర్థంగా పనిచేస్తున్నదని, దుష్ప్రభావాలు కూడా పెద్దగా లేవని ట్రయల్స్‌లో తేలింది. తాజాగా నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఆర్‌ఐఎస్‌యూజీ ఇంజెక్షన్‌ సక్సెస్‌పుల్‌గా పురుషుల్లో సంతాన నిరోధకంగా పని చేసినట్టు పేర్కొంది. ఆర్‌ఐఎస్‌యూజీ ఇంజెక్షన్‌ 99.02 శాతం గర్భ రాకుండా నిరోధించినట్టు పరిశోధకులు గుర్తించారు.

Read Also: ఒకే బంతికి 14 పరుగులు.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్

Latest News

More Articles