Friday, May 17, 2024

ఒకే బంతికి 14 పరుగులు.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్

spot_img

వరల్డ్ కప్ 2023లో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి, బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 256 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు 41.3 ఓవర్లలోనే విజయం అందుకుంది. కాగా.. ఈ మ్యాచులో 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో విరాట్ కోహ్లీ 103 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు.

Read Also: రోజూవారీ కూలీ అకౌంట్లో రూ. 221 కోట్లు

అయితే విరాట్ కోహ్లీ ఈ మ్యాచులో అరుదైన ఫీట్‎ను సాధించాడు. ఒకే బంతికి 14 పరుగులు చేసి ఈ రికార్డును అందుకున్నాడు. హసన్ మహమూద్‌ బౌలింగ్‎లో 13వ ఓవర్‎లో రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. ఆ ఓవర్ ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. అయితే అది నో బాల్ కావడంతో అంపైర్ ఫ్రీ హిట్ ఇచ్చాడు. అనంతరం ఎదుర్కొన్న బంతిని మిడాన్‌ మీదుగా బౌండరీ కొట్టాడు. అయితే ఆ బంతి కూడా నో బాల్ కావడంతో మరో ఫ్రీ హిట్‌ లభించింది. ఆ బంతిని కూడా విరాట్.. లాంగాన్‌ మీదుగా స్టాండ్స్‌లో పడేసి సిక్స్ సాధించాడు. ఆ తర్వాత వచ్చిన బంతి ద్వారా మరో రెండు పరుగులు చేశాడు. ఈ విధంగా ఒకే బంతికి 2, 4, 6, 2 పరుగుల ద్వారా మొత్తం 14 రన్స్ సాధించారు.

Read Also: హైదరాబాద్‎లో తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‎ను ఢీకొట్టి, దూసుకెళ్లిన కారు

Latest News

More Articles