Saturday, May 18, 2024

అమెరికాలో భారతీయ ఫ్యామిలీ సూసైడ్.. టెస్లా కారుతో 300 అడుగుల లోయలో పడ్డా..

spot_img

అమెరికాలో నివసించే భారతీయ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని.. టెస్లా కారులో ప్రయాణించి 300 అడుగుల లోయలోకి డ్రైవ్ చేశాడు. అయితే అదృష్టవశాత్తు ఆ కారులోని వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.

భారత సంతతి వ్యక్తి అయిన 41 ఏళ్ల ధర్మేష్ ఏ పటేల్, కాలిఫోర్నియాలోని ఓ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అతడు భావించాడు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కలిసి టెస్లా కారులో ప్రయాణించి శాన్ మాటియో కౌంటీ వద్ద హైవే మార్గంలోని కొండపై నుంచి లోయలోకి కారును డ్రైవ్ చేశాడు.

సుమారు 300 అడుగుల ఎత్తు నుంచి కొండ రాళ్ల మధ్య పడిన ఆ టెస్లా కారు తుక్కుతుక్కైంది. దీనిని చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ సిబ్బంది తాళ్ల సహాయంతో కారు పడిన ప్రాంతానికి చేరుకున్నారు.

కారులో ఉన్న ధర్మేష్ అతని భార్య, వారి పిల్లలు 9 ఏళ్ల బాలుడు, నాలుగేళ్ల పాప స్వల్ప గాయాలతో బతికి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. హెలికాప్టర్‌ ద్వారా వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకునేందుకు ధర్మేష్‌ పటేల్‌ కావాలనే కారును లోయలోకి డ్రైవ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో ధర్మేష్ పై ఆత్మహత్యాయత్నం, హత్యాయత్నం, చిన్న పిల్లలకు హాని కలిగించడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ కాగానే ధర్మేష్‌ను అరెస్ట్‌ చేస్తామని పోలీస్‌ అధికారి తెలిపారు. మరోవైపు ఎత్తైన కొండ పైనుంచి కిందకు టెస్లా కారు పడినప్పటికీ అందులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో టెస్లా కారు సాంకేతికతను నెటిజన్లు కొనియాడుతున్నారు.

Latest News

More Articles