Tuesday, May 21, 2024

న్యూ ఇయర్ ఆఫర్.. యాపిల్ వాచ్ పై రూ. 6000 డిస్కౌంట్‌

spot_img

నూత‌న సంవ‌త్స‌రం వేళ త‌మ సేల్స్ పెంచుకునేందుకు కంపెనీలు ఆక‌ర్ష‌ణీయ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. తాజాగా యాపిల్ కంపెనీ తమ యాపిల్ వాచ్ సిరీస్ 9పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షోరూం విజ‌య్ సేల్స్ ఈ వాచ్ మీద హాట్ డీల్‌ను ప్ర‌క‌టించింది. విజ‌య్ సేల్స్ ద్వారా ఆర్డ‌ర్ చేసిన వారికి ఈ క్రేజీ వాచ్‌పై ఏకంగా రూ. 6000 డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫ‌ర్ హెచ్‌డీఎఫ్‌సీ కార్డుదారుల‌కు మాత్రమేనని తెలిపింది. విజ‌య్ సేల్స్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 9 రూ. 50,850కి అందుబాటులో ఉంది.

Read Also: ఫోన్ కోసం మెట్రో ట్రాక్‌పై దూకిన యువతి

విజ‌య్ సేల్స్ వెబ్‌సైట్ నుంచి యాపిల్ వాచ్ సిరీస్ 9ని కొనుగోలు చేసే యూజర్ల‌కు నేరుగా రూ. 4050 డిస్కౌంట్ ల‌భిస్తుండ‌గా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుదారులు అద‌నంగా ఈ వాచ్‌పై రూ. 2500 ఆఫ‌ర్ పొందే వెసులుబాటు ఉంది. ఈ రెండు ఆఫ‌ర్లు ఉప‌యోగించుకుంటే ఈ హాట్ స్మార్ట్‌వాచ్‌పై యూజ‌ర్ల‌కు రూ. 6500 డిస్కౌంట్ ల‌భించ‌నుంది.

Latest News

More Articles