Saturday, May 18, 2024

ఢిల్లీలో అగ్నిప్రమాదం.. రెండు కుటుంబాలు సజీవదహనం

spot_img

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలు సజీవదహనం అయ్యాయి. ఈ దారుణ ఘటన గురువారం రాత్రి జరిగింది. పితంపుర ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల ఇంట్లోని మొదటి, రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదులోకి తీసుచొచ్చారు. మంటల్లో చిక్కకున్న ఏడుగురిని స్థానికుల సాయంతో బయటకు తీసి, బాబు జగ్జీవన్ రామ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురు మహిళలు సహా ఆరుగురు ఆసుపత్రిలో మరణించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారి తెలిపారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని, గంటలో మంటలను ఆర్పివేశామని, కూలింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని మరో డీఎఫ్‌ఎస్ అధికారి తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో మృతి చెందిన వారు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన వారని తెలిపారు. మృతుల వయస్సు 25 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు. మంటలను ఆర్పివేశామని, శీతలీకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

Read Also: కోచింగ్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు

Latest News

More Articles