Sunday, May 19, 2024

తెలంగాణకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో చెప్పిన వినోద్ కుమార్

spot_img

తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసన సభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది .ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ కార్పోరేషన్‌ల ఛైర్మన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా బి.వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర లక్ష్యం తెలంగాణ సాధించడం అది నెరవేరింది. తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాదించుకున్నము. 2014 ఎన్నికల్లో తొలి సీఎం గా కేసీఆర్ అయ్యారు. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో రాష్ట్రం ఏర్పడింది. ఈ రోజు తెలంగాణ మొత్తం నీళ్లు ఇస్తున్నమ్..

ఇక తెలంగాణలో సంక్షేమ పథకాలు ఇక్కడ ఉన్నట్టు ఏ రాష్ట్రంలో లేవు. ఆసరా పింఛన్లు,రైతు బంధు,రైతు బీమా ఎన్నో పథకాలతో తెలంగాణ ముందు వరుసలో ఉంది. 10 సంవత్సరాల అభివృద్ధిని తెలియజేస్తూ 21 రోజుల పాటు తెలియజేయలని మాకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ వస్తే ఏమస్తది అని ప్రశ్నలు అడిగిన ముర్కులకు నేటి అభివృద్ధి గురించి చూడాలి. నాడు అసెంబ్లీలో తెలంగాణ వస్తే అందకరంలోకి పోతుంది అని ఎద్దేవా చేశారు. 2023 డిసెంబర్ లో జరిగే ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి గా కేసీఆర్ అవుతారు. బిఅరెస్ ఘనవిజయం సాధిస్తుంది. కర్ణాటకలో బిజెపి పార్టీమీద విసుగు చెందారు. ఏ పార్టీ ప్రత్యామ్నాయము లేనందున కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు’ అని అన్నారు వినోద్ కుమార్.

Latest News

More Articles