Thursday, May 16, 2024

సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ తోపాటు ఈ స్కీమ్స్‎లో చేరినవారికి బ్యాడ్‎న్యూస్..!

spot_img

మధ్యతరగతి ప్రజలకు మోదీ సర్కార్ మరోసారి షాకిచ్చింది. ఈసారి చాలా వరకు సేవింగ్ స్కీమ్స్ పై వడ్డీ రేటును పెంచలేదు. మునుపటిలానే స్ధిరంగా కొనసాగించింది. అయితే ఇది సామాన్య ప్రజలకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ప్రభుత్వం ఒక స్కీమ్ పై మాత్రం వడ్డీ రేటు పెంచింది. అక్టోబర్ , డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి వడ్డీరేట్లు పెంపు వర్తిస్తుంది. వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్స్ వరకు పెరిగింది. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పై వడ్డీ రేటు పెంచింది. మిగతా స్కీమ్స్ అన్నింటిపైనా వడ్డీ రేటును పెంచుకుండా స్థిరంగానే కొనసాగింది.

ఇక సేవింగ్స్ డిపాజిట్ కు వడ్డీలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో వార్షిక వడ్డీ 4శాతంగానే కొనసాగుతుంది. ఒక ఏడాది టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.9 శాతం లభించనుంది. రెండేళ్ల టైం డిపాజిట్ వడ్డీ రేటు 7శాతం లభించనుంది. మూడేళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 7శాతం ఉంటుంది. అలాగే ఐదేళ్ల టైమ్ డిపాజిట్ కు 7.5శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ వడ్డీ 6.5శాతం నుంచి 6.7శాతానికి పెరిగింది. వడ్డీ 20 బేసిస్ పాయింట్లు పెరగడం గమనార్హం. ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై వడ్డీ రేటు 8.2శాతం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: రేషన్‌ డీలర్ల కమీషన్ రూ.700 నుంచి రూ.1,400లకు పెంచుతూ ఉత్తర్వులు

అటు మంత్లీ ఇన్ కమ్ అకౌంట్ స్కీం వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఎప్పటిలాగే 7.4శాతం ఉంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీ రేటు 7.7శాతం వడ్డీ లభిస్తంది. పీపీఎఫ్ స్కీమ్ వడ్డీ 7.1శాతం ఉంది. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ 7.5శాతం, సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌కు 8 శాతం. ఈ స్కీమ్స్ అన్నింటిపైనా వడ్డీ రేటు నిలకడగానే కొనసాగించింది.

Latest News

More Articles